వరంగల్ గ్రామీణ జిల్లాలో రూ.10లక్షలు విలువ చేసే గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వర్ధన్నపేట మండల కేంద్రం శివారులో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై నిర్వహించిన తనిఖీల్లో మత్తు పదార్థాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
ఓ కారుతో సహా ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసినట్లు వెల్లడించారు. ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశామని అన్నారు.
ఇదీ చదవండి: రాహుల్ గాంధీ కోసం మహా చండీ యాగం చేస్తున్న వీహెచ్