ETV Bharat / crime

రూ. 1.3 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ పట్టివేత - భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత

విదేశీ కరెన్సీని అక్రమంగా దుబాయ్​కి తరలిస్తున్న ఓ వ్యక్తిని సీఐఎస్​ఎఫ్​ పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి భారీ మొత్తంలో అరబ్​ దేశాల కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

Seizure of foreign currency worth Rs 1.3 crore in shamshabad airport
రూ. 1.3 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ పట్టివేత
author img

By

Published : Mar 25, 2021, 2:44 AM IST

బూందీ మాటున ఇతర దేశాలకు భారీగా విదేశీ కరెన్సీని తరలిస్తున్న మహమ్మద్​ అనే వ్యక్తిని శంషాబాద్​ విమానాశ్రయ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 1.3కోట్ల విలువైన అరబ్ దేశాలకు చెందిన కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్​లోని పాతబస్తీకి చెందిన మహమ్మద్​​ దుబాయ్​ వెళ్లేందుకు శంషాబాద్‌ ఎయిర్​పోర్టుకు వచ్చాడు. అతని లగేజీని స్కానింగ్​ చేసిన సీఐఎస్​ఎఫ్​ పోలీసులు అందులో విదేశీ కరెన్సీ ఉన్నట్లు గుర్తించి కష్టమ్స్​ అధికారులకు సమాచారం అందించారు. ఆ తనిఖీలో 1.3 కోట్ల మేర విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నామని కస్టమ్స్‌ డిప్యూటీ కమిషనర్‌ శివకృష్ణ తెలిపారు. పట్టుబడిన డబ్బులో కువైట్‌ దినార్లు, బహ్రెయిన్​‌ దినార్లు, ఓమెన్‌ రియాల్స్‌, ఖతార్‌ రియాల్స్, సౌదీ రియాల్స్‌, యుఏఈ దీరమ్స్‌ తదితర దేశాలకు చెందిన కరెన్సీ ఉన్నట్లు వివరించారు. నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని చెప్పారు.

ఇదీ చదవండి: ఫ్యాన్​కు ఉరేసుకుని బాలిక ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.