రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయాలు జరిపేందుకు మహారాష్ట్ర నుంచి తీసుకు వస్తోన్న 445 బస్తాల ధాన్యాన్ని రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాపనపల్లి సమీపంలోని అంతర్రాష్ట్ర తనిఖీ కేంద్రం వద్ద.. రెండు డీసీఎంలను స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి.. మహారాష్ట్రలో పండించుకున్న తన ధాన్యాన్ని సుల్తానాబాద్‌లో విక్రయించడానికి తీసుకువస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని తహసీల్దార్ శ్రీనివాసరావు తెలిపారు. విచారణ అనంతరం.. శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు.
ఇదీ చదవండి: బ్లాక్‌లో రెమ్‌డెసివిర్ విక్రయం.. 11 మంది అరెస్టు