ETV Bharat / crime

పాఠాలు చెప్పాల్సిన నోటి నుంచి కామపురాణం.. వెలుగులోకి ఆడియో - బాలికకు ఉపాధ్యాయుడి వేధింపులు

Sexual Harassment: ఏ పిల్లలైనా సరే.. తల్లిదండ్రుల తర్వాత అంతే స్థాయిలో గౌరవించేది చదువు చెప్పిన గురువును. విద్యాబుద్ధులు నేర్పించి మన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేది వారే. కానీ కొందరు ఉపాధ్యాయులు చేసే కీచక పనుల వల్ల.. దేవాలయం లాంటి పాఠశాలలకు ఆడపిల్లలను పంపించడానికి తల్లిదండ్రులు జంకుతున్నారు. పాఠాల్లో సందేహాలు తీర్చాల్సిన ఉపాధ్యాయుడే.. తన కోరికను తీర్చాలంటూ విద్యార్థిని వెంటపడితే.. తమ కుమార్తెతో ఆ కీచకుడి సంభాషణ తల్లిదండ్రులు చెవిన పడితే.. అది విని తట్టుకోవడం ఎవరి తరమూ కాదు. ఏపీలో తాజాగా వెలుగులోకి ఓ ఉపాధ్యాయుడి లైంగిక వేధింపుల ఘటన.. ఆడపిల్లల తల్లిదండ్రుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

Teacher Sexual Harassment
విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు
author img

By

Published : Feb 14, 2022, 5:07 PM IST

Teacher Sexual Harassment: బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ఉపాధ్యాయుడు.. విద్యార్థిని పట్ల వికృతంగా ప్రవర్తించాడు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు నీచమైన పనికి దిగజారాడు. ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం శ్రీధరగట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు.. ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించి పైశాచిక ఆనందాన్ని పొందాడు. విద్యార్థిని ఇంట్లో ఉన్న మొబైల్​కు ప్రతి రోజు ఫోన్​, చాటింగ్ చేస్తూ విద్యార్థినితో వికృతంగా ప్రవర్తిస్తుండేవాడు. తన భార్యకు ఏడాదిగా ఆరోగ్యం బాగాలేదని.. పడక సుఖానికి పనికిరాదని తన కోరిక తీర్చాలంటూ వాయిస్ మేసెజ్​లు పంపించి వేధింపులకు గురి చేస్తుండేవాడు. దైవంగా భావించే గురువే.. రాక్షసుడిగా మారడంతో ఏం చేయాలో తెలియక, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఆ విద్యార్థిని మానసికక్షోభకు గురైంది. తన పరిస్థితి ఇది అంటూ.. అర్థం చేసుకొని కోరిక తీర్చాలంటూ విద్యార్థినికి ఆ కీచకుడు పంపిన ఆడియో సందేశం.. వెలుగులోకి వచ్చింది.

వెలుగులోకి ఉపాధ్యాయుడి ఆడియో సందేశం

విషయం ఇలా బయటపడింది..

ఓ రోజు విద్యార్థిని ఇంట్లో లేని సమయంలో ఉపాధ్యాయుడు ఫోన్ చేశాడు. కుటుంబ సభ్యులు ఫోన్ లిప్ట్ చేయగా.. అవతలి వైపు ఎవరు ఫోన్ లిప్ట్​ చేశారో తెలియకుండానే తన కామ పురాణాన్ని మెుదలుపెట్టాడు. అది విన్న విద్యార్థిని తల్లిదండ్రులు.. షాక్​కు గురయ్యారు. దీంతో ఉపాధ్యాయుడిని నిలదీసేందుకు పాఠశాలకు వెళ్లగా.. అతను సెలవులో ఉన్నాడని ప్రధానోపాధ్యాయుడు వెల్లడించారు.

విషయం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖ అధికారులు ఘటనపై విచారణకు ఆదేశించారు. కాగా.. కీచక ఉపాధ్యాయుడి తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. అతడిపై చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యార్థినిలు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇదీ చదవండి: ఒకసారి కాదు.. రెండుసార్లు అతని చేతిలోనే.. బయటకు చెబితే పరువు పోతుందని..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.