జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వేంపల్లి శివారులోని వాగు నుంచి కొందరు అక్రమార్కులు ఇసుకను తరలిస్తున్నారు. పెద్ద ఎత్తున ట్రాక్టర్లు సిద్ధం చేసి ఇసుకను తోడేస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకునేందుకు వాగు వద్దకు వెళ్లారు.
ఇవీ చదవండి :
- SAND MAFIA: గుట్టలను మాయం చేస్తూ.. కాలువల మట్టిని కాజేస్తూ..
- కాగ్నా నదిలో ఇసుక తోడేళ్లు.. పట్టించుకోని అధికారులు
అక్రమ ఇసుక రవాణా ఆపివేయాలని హెచ్చరించిన పోలీసులపై ఇసుక మాఫియా దాడికి దిగింది. కర్రలు, రాళ్లతో పోలీసులను విచక్షణా రహితంగా కొట్టారు. ఈ దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకన్న గ్రామస్థులు పెద్దఎత్తున రావడం వల్ల ఇసుకాసురులు అక్కణ్నుంచి పరారయ్యారు.
- ఇదీ చదవండి : బస్తాల్లో ఇసుక విక్రయం- ప్రభుత్వం యోచన
ఈ క్రమంలో వారు.. వాగులోనే 5 ట్రాక్టర్లను వదిలి వెళ్లారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. దాడికి పాల్పడ్డ వారి కోసం గాలిస్తున్నారు.
ఇదీ చదవండి SAND MINING: ఇసుక సరఫరాలో దళారుల దందా.. మూడు రోజుల్లోనే రూ.300 పెంపు