వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో విషాదం చోటుచేసుకొంది. తొర్రూర్ డిపోలో బస్ డ్రైవర్గా విధులు నిర్వర్తిస్తున్న సర్వర్ మియా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే తీవ్ర గాయాలపాలైన బాధితుడు.. ప్రాణాలు విడిచాడు. ఇంటి పెద్ద మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఘటనకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: పోస్టుల వివాదం.. జనసేన కార్యకర్తపై కర్రలతో దాడి