rtc bus hit lorry at jammapuram : లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకు వేయడం వల్ల వెనుక వస్తున్న ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని 15 మంది గాయపడ్డారు. ఈ ఘటన యాదాద్రి జిల్లా భువనగిరి మండలం జమ్మాపురం వద్ద జరిగింది. హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనదారుడు కింద పడిపోవడంతో.....లారీ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. ఆ సమయంలో జగద్గిరిగుట్ట నుంచి హన్మకొండ వెళ్తున్న బస్సు....లారీని ఢీకొట్టింది.
ప్రమాద సమయంలో బస్సులో 65 మంది ఉన్నారు. వారిలో 15 మందికి గాయాలయ్యాయి. కండక్టర్ చెయ్యి విరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో ఆర్టీసీ బస్సు ముందు భాగం దెబ్బతింది.
ఇదీ చూడండి: undavalli accident : ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి