RTC Bus Accident at Morampally: లారీని తప్పించబోయి ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఖమ్మం డిపోకి చెందిన ఎక్స్‌ప్రెస్ సర్వీసు బస్సు మణుగూరు నుంచి ఖమ్మం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక ఆర్టీసీ అధికారులు ప్రమాదానికి సంబంధించిన కారణాలను ఆరా తీస్తున్నారు. ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి: చెరుకు లోడ్‌ను ఢీకొట్టిన మినీ ట్రక్కు- ఐదుగురు మృతి