ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో జరిగింది. మండలంలోని రాళ్ల గూడెం సమీపంలో ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: విషాదం: పిడుగుపాటుకు ముగ్గురు దుర్మరణం