ETV Bharat / crime

ACCIDENT: బస్టాండు ఎదుటే రోడ్డు ప్రమాదం.. 12 మందికి గాయాలు

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కూకట్​పల్లి నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన బోరె వెల్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులు తీవ్ర గాయాలపాయ్యారు.

rtc-bus-accident-in-suryapeta-district
బస్టాండు ఎదుటే రోడ్డు ప్రమాదం.. 12 మందికి గాయాలు
author img

By

Published : Aug 9, 2021, 10:01 AM IST

Updated : Aug 9, 2021, 11:31 AM IST

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద తెల్లవారు జామున జరిగిన ప్రమాదంలో 12 మంది ప్రయాణీకులకు తీవ్ర గాయాలయ్యాయి. కూకట్ పల్లి నుంచి ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన బోర్‌వెల్ లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను 108 వాహనంలో జిల్లా ఆసుపత్రికి తరలించారు.

బస్టాండు ఎదుటే రోడ్డు ప్రమాదం.. 12 మందికి గాయాలు

స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ఆర్టీసీ, పోలీస్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును గురించి తెలుసుకున్నారు. ప్రమాద కారణంగా నిలిచిపోయిన ఇతర ప్రయాణికులను మరో వాహనంలో గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేశారు. రోడ్డుప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: fire accident : కాకినాడలో కారు దగ్ధం.. వృద్ధ దంపతులు సురక్షితం

Last Updated : Aug 9, 2021, 11:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.