నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని నిర్మల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఉదయం 4 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి బస్సు నిర్మల్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 24 మందికి గాయాలయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను నిర్మల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇవీ చదవండి: