ETV Bharat / crime

కోట్లు కొల్లగొట్టిన సైబర్​ దొంగ.. రెండేళ్లకు అరెస్ట్!

సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో అక్రమాలకు పాల్పడ్డాడు. కోట్ల రూపాయలు దోచుకుని.. రెండేళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తిరిగాడు. వైద్య పరికరాలు సరఫరా చేస్తానంటూ మోసాలకు పాల్పడ్డ ఓ వ్యక్తిని హైదరాబాద్​ సైబర్ ​క్రైం పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్​ చేశారు.

Rs. 4 crore fraud Accused Arrested after two years in hyderabad
కోట్లు కొల్లగొట్టిన సైబర్​ దొంగ.. రెండెళ్లకు అరెస్ట్!
author img

By

Published : Feb 23, 2021, 5:21 AM IST

వైద్య పరికరాలు సరఫరా చేస్తానంటూ రూ. 4. 43 కోట్ల మోసానికి పాల్పడిన ఓ వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. రెండేళ్ల నుంచి తప్పించుకు తిరుగుతున్న నిందితుడు రమేశ్​ను​ హైదరాబాద్ సైబర్​ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు.

హబ్సిగూడాలోని అర్పితా డయాగ్నస్టిక్స్... 2019లో జీఈ 1.5 టెస్లా ఎమ్​ఆర్​ఐ సామగ్రి కోసం ఆస్ట్లేర్ మెడిస్ అనే సంస్థను సంప్రదించింది. నిందితుడు రమేశ్.. ఆ సంస్థ ప్రతినిధిగా పరిచయం చేసుకొని, వైద్య పరికరాల సరఫరాకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అలా అతను తెలిపిన ఖాతాలో.. బాధిత సంస్థ డబ్బు జమ చేసింది.

మోసపోయామని గ్రహించిన సంస్థ భాగస్వామి డానియెల్ సోలొమన్ సైబర్​ క్రైం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు​ కోసం గాలింపు చేపట్టారు. ఆలా రెండెేళ్ల అనంతరం.. రమేశ్ ఎ​ట్టకేలకు పోలీసులకు చిక్కాడు.

తమిళనాడుకు చెందిన బాలమురుగన్ అనే వ్యక్తి నుంచి.. నిందితుడు ఇలాగే రూ. 10 లక్షలు కాజేసినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. రమేశ్​ను రిమాండ్​కు తరలించినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: ఎంపీ సంతోశ్​ కుమార్ పేరుతో రెండు లక్షల టోకరా.. ట్విట్టర్​లో ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.