సికింద్రాబాద్లోని ప్రముఖ గణేష్ ఆలయంలో గురువారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. ఆలయంలో ఉన్న హుండీని పగలగొట్టి గుర్తుతెలియని దుండగులు అందులో ఉన్న సొమ్మును దొంగిలించారు. రాత్రి 2 గంటల సమయంలో గుడి వెనుక వైపు నుంచి లోపలికి ప్రవేశించారని ఆలయ వర్గాలు తెలిపాయి. కరోనా తీవ్రత, లాక్డౌన్ దృష్ట్యా ఆలయానికి భక్తుల రద్దీ తగ్గడంతో హుండీ ఆదాయం కూడా కొంతమేర తగ్గినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
చోరీ గురించి గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: 29 రోజులకు రూ.24 లక్షల బిల్లు!