ETV Bharat / crime

ROAD ACCIDENT: ఘోర రోడ్డు ప్రమాదం... తాత, మనవరాలు ఆశలు ఆవిరి - telangana news

మనువరాలితో కలిసి ఓ వ్యక్తి సరదాగా గడుపాలనుకున్నాడు. మనువరాలు సైతం తాతయ్యవెంట ఇంటికి వెళ్లి ఆడిపాడి ఆనందంగా గడుపాలనుకుంది. కానీ అంతలోనే వారి ఆశలు ఆవిరయ్యాయి. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు తాత, మనవరాలిని పొట్టన పెట్టుకుంది. ఈ విషాద ఘటన నిర్మల్​ జిల్లాలో చోటుచేసుకుంది.

ఘోర రోడ్డు ప్రమాదం
ఘోర రోడ్డు ప్రమాదం
author img

By

Published : Sep 18, 2021, 9:18 PM IST

రోడ్డు ప్రమాదంలో తాత, మనవరాలు మృతి చెందిన ఘటన నిర్మల్​ జిల్లాలో జరిగింది. సారంగపూర్ మండలం గోపాల్ పేట్​కు చెందిన బచ్చన్ సింగ్, చంద్రకళలు ఆదిలాబాద్ జిల్లా బజార్​ హట్నూర్ మండలం హర్కయిలో ఉండే కూతురు లలిత ఇంటికి వెళ్లారు. ఆనందంగా గడిపారు. అనంతరం మనువరాలు రితిక(04)తో కలిసి ద్విచక్ర వాహనంపై ముగ్గురు బయలుదేరారు.

నెరడిగొండ మండలం వాంకిడి సమీపంలో జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బచ్చన్ సింగ్ అక్కడికక్కడే మరణించారు. తీవ్రగాయాలతో ఉన్న రితికను నిర్మల్ ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఈ ప్రమాదంతో ఇరుగ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి: cyber crime: మాయమాటలు చెప్పి... రూ.3 లక్షలు కాజేశారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.