ఏపీలోని కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు పత్తికొండకు చెందిన చాంద్ బాషా (32), జిలాన్(28)లుగా పోలీసులు గుర్తించారు.
ప్రమాదంలో చాంద్ బాషా తల తెగి రోడ్డుపై పడింది. ప్రమాద విషయం తెలిసి మృతుల కుటుంబం, గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఇదీ చదవండి: కారును తప్పించబోయి.. చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు