మిత్రుడి పదవీ విరమణ వేడుకకు వెళ్లిన ఓ హెడ్ కానిస్టేబుల్.. రోడ్డు ప్రమాదంలో మరణించిన విషాదకర ఘటన.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగింది. తెనాలికి చెందిన వేల్పుల శ్రీనివాసరావు.. తెలంగాణలోని నల్గొండలో ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. ఆయన.. మిత్రుడి పదవీ విరమణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు నరసరావుపేట వెళ్లారు.
విజయవాడలో రైల్వే టికెట్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న కోటిరెడ్డితో కలిసి ద్విచక్రవాహనంపై తిరుగు ప్రయాణమయ్యారు. ఫిరంగిపురం సమీపంలో వారి వాహనాన్ని ఓ లారీ ఢీ కొట్టింది. శ్రీనివాసరావు గాయాలపాలై.. అక్కడికక్కడే చనిపోయారు. తీవ్ర గాయాలపాలైన కోటిరెడ్డిని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: లైవ్ వీడియో: లబ్ధిదారుడి చెంప చెళ్లుమనిపించి రేషన్ డీలర్