మెదక్ జిల్లా కొల్చారం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి మెదక్ వైపు వెళ్తున్న కారు కొల్చారం గ్రామం నుంచి వరిగుంతం వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై నున్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. జంక్షన్ దాటుతున్న సమయంలో కారును చూసుకోకుండా వెళ్లడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను మెదక్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.
ఇదీ చదవండి: Police accident today: లారీని ఢీకొన్న పోలీసు వాహనం.. ఏఎస్సై పరిస్థితి విషమం