కామారెడ్డి జిల్లా లింగాపూర్‌లో జరుగుతున్న వివాహానికి ట్రాక్టర్లో గాంధారి మండలం జువ్వాడి నుంచి పెళ్లి సామగ్రి తీసుకెళ్తున్నారు. సామానుతోపాటు మరో 20మంది వరకు బంధువులు ఇదే ట్రాక్టర్లో పెళ్లికి వెళ్తున్నారు. తాడ్వాయి మండలం కృష్ణాజివాడి సమీపంలో మూలమలుపు వద్ద వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ను టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదం(Accident)లో 15 మందికి పైగా గాయాలయ్యాయి.
వారిని వెంటనే కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కాశవ్వ(60) అనే వృద్ధురాలు మృతి చెందింది. కృష్ణాజివాడి వద్ద రద్దీగా ఉండటంతో ట్రాక్టర్ డ్రైవర్ బ్రేక్ వేయగా.. వెనుక నుంచి వస్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో ట్రాక్టర్ బోల్తా పడినట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: Harish rao: మీరు ఇవ్వరు.. మమ్మల్ని కొనుగోలు చేయనివ్వరు: హరీశ్