ETV Bharat / crime

సంగారెడ్డి జిల్లాలో యువకుడిపై ప్రతీకార హత్య.. ఏమైందంటే - young man murder in chinna chinnachilmeda

Revenge killing In Sangareddy: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్నచెల్మెడలో దారుణం చోటుచేసుకుంది. రెండేళ్ల క్రితం తమ కుమారుడు పవన్​ను ఆనంద్​ అనే వ్యక్తి పేకాటలో తగవులాడి రాయితో కొట్టి దారుణంగా చంపాడు. ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్న పవన్​ కుటుంబ సభ్యులు ఆనంద్​ రాత్రి ఊళ్లోకి వచ్చాడనే విషయం తెలుసుకొని ఇవాళ హతమార్చారు.

సంగారెడ్డి జిల్లాలో యువకుడిపై ప్రతీకార హత్య.. ఏమైందంటే

author img

By

Published : Nov 11, 2022, 4:53 PM IST

Revenge killing In Sangareddy: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్నచెల్మెడలో ప్రతీకార హత్య జరిగింది. రెండేళ్ల క్రితం తమ కుమారుడిని చంపిన ఆనంద్​ అనే యువకుడిని కుటుంబ సభ్యులు నడిరోడ్డులో జనం చూస్తుండగానే కళ్లలో కారం చల్లి దారుణంగా హత్య చేశారు. చిన్నచెల్మెడ గ్రామానికి చెందిన యువకుడు పవన్​ను అదే గ్రామానికి చెందిన బేగరి ఆనంద్ పేకాట విషయంలో తగువులాడి బండరాయితో కొట్టి చంపాడు. ప్రతీకార చర్య కోసం ఎదురుచూస్తున్న పవన్ కుటుంబ సభ్యులు తమ కుమారుడిని చంపిన ఆనంద్ రాత్రి ఊళ్లోకి వచ్చాడనే విషయం తెలుసుకున్నారు.

ఉదయాన్నే ఆనంద్ మార్నింగ్​ వాక్​ ​కోసం ​బయటకు రావడంతో పవన్​ కుటుంబ సభ్యులు ఆనంద్​ కళ్లల్లో కారం చల్లి గొడ్డలితో అతనిపై దాడి చేసి తల, మెండెం వేరు చేసి కాళ్లు చేతులు నరికి పక్కన పడేశారు. ఈ దారుణాన్నికాళ్లారా చూసిన గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆనంద్​ను హత్య చేసిన నిందితులు పోలీస్​ స్టేషన్​లో లొంగిపోయారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.