ETV Bharat / crime

హైదరాబాద్‌ నుంచి విశాఖకు కొరియర్లో ‘రెమ్‌డెసివిర్‌’! - రెమ్​డెసివర్ అక్రమరవాణా

హైదరాబాద్‌ నుంచి ఏపీలోని విశాఖకు అనధికారికంగా రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు వస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో తేలింది. నగరానికి చెందిన కొందరు మధ్యవర్తులు విశాఖలో ఎవరికి అవసరమో గుర్తించి సదరు వ్యక్తులకు వాటిని పంపేలా వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇందుకోసం విశాఖలోని పలువురు ఆసుపత్రి సిబ్బంది, పారామెడికల్‌ సిబ్బందితో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. ప్రస్తుతం విశాఖలో రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లకు డిమాండు ఉంది.

remidiciver-illegally-courier-from-hyderabad-to-visakhapatnam
హైదరాబాద్‌ నుంచి విశాఖకు కొరియర్లో ‘రెమ్‌డెసివిర్‌’!
author img

By

Published : May 21, 2021, 10:43 AM IST

నెల 19న హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాసరెడ్డి రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను ఓ ప్రధాన కొరియర్‌ సర్వీసు ద్వారా విశాఖలోని స్నేహితుడికి పంపారు. హైదరాబాద్‌లో ఓ కొవిడ్‌ బాధితుడి కోసం వాటిని కొనుగోలు చేయగా అతను మృతి చెందడంతో... మిగిలిపోయిన వాటిని అమ్మకానికి పెట్టారు. ఇందు కోసం విశాఖలోని తన స్నేహితులను వాట్సప్‌లో సంప్రదించారు. ఈ వాట్సప్‌ సందేశాలు ఔషధ నియంత్రణశాఖ డీజీ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే విశాఖలోని అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు రోగి బంధువుల మాదిరి ఇంజక్షన్లు కావాలని ఫోన్‌ చేయగా అయిదు వయల్స్‌ ధర రూ.1.35 లక్షలుగా పేర్కొన్నారు. తరువాత అధికారులు వలపన్ని వారిని పట్టుకోవడంతో ఎట్టకేలకు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అవి హైదరాబాద్‌ నుంచి ఎలా వచ్చాయి, ఏ కొరియర్‌ నుంచి ఎవరి ద్వారా వచ్చాయి వంటి అంశాలను ఆరా తీశారు.
నెల 12న కలెక్టరేట్‌కు సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కొవిడ్‌తో బాధపడుతున్న వ్యక్తికి ఆక్సిజన్‌ అందక శ్వాస ఇబ్బందిగా మారడంతో రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు అవసరమన్నారు. నగరంలో ఒకటి, రెండు చోట్ల సంప్రదించగా ఒక్కో వయల్‌ రూ.35 వేలు అవుతుందన్నారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని తెలిసిన బంధువులను సంప్రదించగా అక్కడ ఒక్కో వయల్‌ రూ.25 వేలకు దొరకడంతో ఆరు వయల్స్‌ను హైదరాబాద్‌ నుంచి పార్సిల్‌ రూపంలో తెప్పించుకున్నారు.
* అధిక సంఖ్యలో ఆసుపత్రులు కొవిడ్‌ చికిత్స అందిస్తుండటంతో విశాఖలోని వ్యక్తులతో హైదరాబాద్‌ నుంచి కొందరు సంప్రదింపులు జరుపుతున్నారు. ముఖ్యంగా విశాఖలో కొవిడ్‌ చికిత్సకు అనుమతి తీసుకోకుండా వైద్యం చేస్తున్న కొన్ని ఆసుపత్రుల నిర్వాహకులు వీరి ద్వారా తెప్పించుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అందుకే ఆసుపత్రి నిర్వాహకులే బాధితులకు ఇచ్చే ఇంజక్షన్ల నిమిత్తం ఒక్కో వయల్‌కు రూ.30 నుంచి రూ.35 వేలు వసూలు చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. హైదరాబాద్‌ నుంచి కొంత తక్కువకు తెప్పించుకొని విశాఖలోని బాధితులకు కొంత అదనపు ధరతో అమ్ముతున్నట్లు తెలుస్తోంది.

కొరియర్లో తెప్పిస్తున్నారు: కొందరు రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను నగరానికి ఇతర ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నారు. ఇటీవల వలపన్ని కొందరి నుంచి ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నాం. వాళ్లకు ఎలా వచ్చాయనేది నిందితులను ఆరా తీస్తే ...హైదరాబాద్‌ నుంచి కొరియర్‌ ద్వారా వచ్చినట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఔషధ నియంత్రణశాఖ డీజీకి వచ్చిన సమాచారం మేరకు దీన్ని పట్టుకున్నాం. అక్రమంగా తీసుకొస్తున్న వాటిపైనా దృష్టిసారిస్తున్నాం. రెమ్‌డెసివిర్‌, ఇతర ఇంజక్షన్లపైనా ప్రత్యేక నిఘా ఉంచాం.

- డి.సునీత, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఔషధ నియంత్రణశాఖ (విజిలెన్స్‌)

తెలిసినవాళ్లతో..

విశాఖలోని బాధిత కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని తమ బంధువులు, తెలిసిన వాళ్లు ఉంటే వారితో తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖలో ఒక్కో వయల్‌ రూ.30 వేలు వరకు చెప్పడంతో ప్రత్యామ్నాయంగా హైదరాబాద్‌లో ఫార్మా, వైద్య రంగాల్లో పనిచేసే వారి ద్వారా ఒక్కో వయల్‌ను రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పార్సిల్‌ సర్వీసుల ద్వారా తెప్పించుకుంటున్నారు. కొంతైనా ఖర్చు తగ్గుతుందని ఇలా నల్లబజారును ఆశ్రయిస్తున్నారు.
* హైదరాబాద్‌ నుంచి రప్పిస్తున్న రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు బాధితుల చేతికి చేరాలంటే నలుగురు మధ్యవర్తులతో మాట్లాడితేగాని అందడం లేదు. హైదరాబాద్‌ నుంచి కొరియర్‌లో తెప్పించిన ఇంజక్షన్లను స్వాధీనం చేసుకునేందుకు బుధవారం ఔషధ నియంత్రణశాఖ అధికారులు... నిఘా అమలుశాఖ అధికారుల సాయంతో బాధిత కుటుంబ సభ్యుల అవతారమెత్తి నలుగురు మధ్యవర్తులను కలిస్తేగాని అవి చేతికి చిక్కలేదు. ఇందుకోసం మూడు చోట్లకు వెళ్లాల్సి వచ్చింది.
* కొందరు కొరియర్‌, పార్సిల్‌ సర్వీసుల ద్వారా ఇళ్లకే తెప్పించుకుంటున్నారు. ఉదయం హైదరాబాద్‌ నుంచి పంపిస్తే సాయంత్రాని కల్లా విశాఖకు చేరుకుంటున్నాయి. కొందరైతే బాక్సుల మీద మెడిసిన్స్‌ అని రాసి రెగ్యులర్‌ కొరియర్‌ నిర్వాహకుల ద్వారా పంపడం గమనార్హం. మరికొందరు గుర్తుపట్టకుండా ఉండేందుకు వీలుగా ఇతర రకాలుగా ప్యాక్‌ చేసి పంపిస్తున్నారు.
* రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను అనధికారికంగా అధిక ధరకు విక్రయిస్తూ పట్టుబడుతున్న వారిలో యువతే ఎక్కువగా ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల వలపన్ని పట్టుకున్న వారిలోని మధ్యవర్తులంతా 25-30 సంవత్సరాల మధ్య వారే.

ఇదీ చూడండి: గాంధీలో కరోనా రోగులకు బలవర్ధక ఆహారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.