ETV Bharat / crime

బ్లాక్​లో రెమ్​డెసివిర్​ అమ్ముతున్న ముఠా అరెస్ట్​ - తెలంగాణ వార్తలు

కరోనా చికిత్సలో ఉపయోగించే రెమ్​డెసివిర్​ ఇంజక్షన్లు అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠాను మంచిర్యాల పోలీసులు అరెస్ట్​ చేశారు. పలు ఆస్పత్రుల యాజమాన్యాలు అంబులెన్స్ డ్రైవర్ల ద్వారా రెమ్​డెసిివిర్​ను అమ్ముతున్నట్లు గుర్తించారు.

బ్లాక్​లో రెమ్​డెసివిర్​ అమ్ముతున్న ముఠా అరెస్ట్​

author img

By

Published : May 16, 2021, 3:11 PM IST

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హెల్త్ కేర్, పల్స్ ఆస్పత్రుల యాజమాన్యం అంబులెన్స్ డ్రైవర్ల ద్వారా రెమ్​డెసివిర్​ ఇంజక్షన్లు అధిక ధరకు విక్రయిస్తోంది. ఒక్కో ఇంజక్షనుకు రూ. 25 వేల నుంచి 30వేల వరకు వసూలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలిందని ఏసీపీ అఖిల్ మహాజన్ వెల్లడించారు.

పోలీసులు, ప్రభుత్వాలు పకడ్బందీగా చర్యలు చేపట్టినప్పటికీ రెమ్​డెసివిర్ అక్రమ దందా ఆగడం లేదన్నారు. మెడికల్ మాఫియా కరోనా రోగుల బలహీనతను ఆసరా చేసుకుని దోపిడీకి పాల్పడుతున్నారని తెలిపారు. కరోనా బాధితుల పేరుమీద డాక్టర్ యొక్క నకిలీ మందుల చిట్టిని తయారుచేసి, హైదరాబాద్​లో రెమ్​డెసివిర్​ కొనుగోలు చేసి మంచిర్యాలలో అధిక ధరలకు విక్రయిస్తున్నారని తెలిపారు. ముఠా సభ్యులు సంతోష్, రాజేందర్, రమేష్​ను అదుపులోకి తీసుకున్నామని.. రంజీత్ పరారీలో ఉన్నట్లు ఏసీపీ తెలిపారు.

ఇదీ చదవండి: కిటకిటలాడిన ముషీరాబాద్​ చేపల మార్కెట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.