ETV Bharat / crime

వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే బిడ్డ మృతి..! - జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వాసుపత్రి

పండంటి బిడ్డకు జన్మనివ్వాలనుకున్న ఓ తల్లికి.. గర్భశోకమే మిగిలింది. నవ మాసాలు మోసిన బిడ్డ.. కడుపులోనే మృతి చెందింది. జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిందీ ఘటన.

infant died
వైద్యుల నిర్లక్ష్యం
author img

By

Published : Apr 9, 2021, 6:00 PM IST

Updated : Apr 9, 2021, 9:05 PM IST

వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి చెందిందంటూ.. బాధితురాలి బంధువులు ఆస్పత్రి ఏదుట ఆందోళన చేపట్టారు. సమయానికి కాన్పు చేయకపోవడంతో.. బిడ్డ కడుపులోనే ప్రాణాలు కోల్పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఇది జరిగింది.

వడ్డేపల్లి మండలం తనగల గ్రామానికి చెందిన అరుణ.. గత రాత్రి పురిటి నొప్పులతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు.. ఆమెకు శస్త్ర చికిత్స చేయకుండా సాధారణ ప్రసవం కోసం వేచి చూశారు. తెల్లవారుజాము నాలుగు గంటల సమయంలో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో.. బంధువులు ఆస్పత్రి సిబ్బందికి సమాచారం అందించారు. ఉదయం ప్రసవం చేసిన వైద్యులు.. అప్పటికే పసికందు చనిపోయిందని వారికి తెలిపారు.

సకాలంలో వైద్యం చేసి ఉంటే.. బిడ్డ బతికేవాడని బాధితురాలి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అనంతరం పోలీసులు జోక్యం చేసుకుని.. వారిని అక్కడినుంచి పంపేశారు.

ఇదీ చదవండి: భార్యాభర్తల మధ్య గొడవ.. కుమారుడితో కలిసి ఇల్లాలు అదృశ్యం

Last Updated : Apr 9, 2021, 9:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.