అత్తింటి వారు మహిళను చంపి బావిలో పడేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బంధువులు యాదాద్రి జిల్లా వలిగొండ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. వెంకటాపురంలో మంగళవారం మంటిపల్లి మంగమ్మ అనుమానాస్పద స్థితిలో బావిలో పడి మరణించింది. మామ, ఇతర కుటుంబసభ్యులే మంగమ్మను చంపి బావిలో పడేశారని ఆమె బంధువులు వలిగొండ పోలీస్ స్టేషన్ ముందు వారిపై దాడికి దిగారు. ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి.
రంగంలోకి దిగిన పోలీసులు వారిని శాంతింపజేశారు. మంగమ్మ భర్త మల్లేష్ గత సంవత్సరం కారు ప్రమాదంలో మృతి చెందాడు. తల్లీదండ్రులిద్దరూ చనిపోవడంతో వారి ముగ్గురు కుమారులు అనాథలయ్యారు. శవపరీక్ష నిమిత్తం మంగమ్మ మృతదేహాన్ని రామన్నపేట ఏరియా ఆసుపత్రికి మంగళవారం తరలించారు.
ఇదీ చదవండి: Assassination: హత్యాచారం.. సెప్టిక్ ట్యాంక్‌లో మృతదేహం