ETV Bharat / crime

నీళ్లలో మత్తు మందు కలిపి.. బాలికపై అత్యాచారం - women harassment news

బంధువుల పెళ్లికి వచ్చిన ఓ బాలికకు పరిచయమైన యువకుడు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇద్దరు మిత్రుల సహకారంతో మంచినీళ్లలో మత్తుమందు కలిపి బాలికను అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులను సోమవారం అరెస్టు చేసి, వారిపై నిర్భయ, పోక్సో కేసు నమోదు చేసినట్లు మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల సీఐ వీరస్వామి తెలిపారు.

rape news
నీళ్లలో మత్తు మందు కలిపి.. బాలికపై అత్యాచారం
author img

By

Published : Jan 26, 2021, 7:01 AM IST

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లకు చెందిన విద్యార్థిని (17) గత నెల డిసెంబరులో హైదరాబాద్‌లోని బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లింది. ఆ సమయంలో మలక్‌పేట్‌లోని ముస్తఫానగర్‌కు చెందిన సబీల్‌ (21) పరిచయమయ్యాడు. బాలిక ఫోన్‌ నంబరు తీసుకొని తరచూ చాటింగ్‌ చేయసాగాడు. ఈ నెల 2వ తేదీ హైదరాబాద్‌కు చెందిన మిత్రులు సయ్యద్‌ తాలిబ్‌ (19), సయ్యద్‌ అల్తాఫ్‌ (20)తో కలసి జడ్చర్లకు వచ్చాడు. బాలికకు ఫోన్‌ చేసి మాయమాటలు చెప్పి కొత్త బస్టాండుకు రప్పించాడు.

అనంతరం సమీపంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లి.. మంచినీళ్లలో మత్తుమందు కలిపి.. ఆమెపై సబీల్‌ అత్యాచారం చేశాడు. దీన్ని సెల్‌ఫోన్లో చిత్రీకరించి తర్వాత బంధువుల ఫోన్లకు పంపాడు. అతని మిత్రులు ఇద్దరు కూడా వీడియోను అడ్డం పెట్టుకొని బాలికను వేధించసాగారు. ఈ క్రమంలో బాధితురాలి కుటుంబ సభ్యుల సెల్‌ఫోన్‌కు కూడా ఆ వీడియో రావడంతో బాలిక తండ్రి ఆదివారం జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు ముగ్గురిని సోమవారం హైదరాబాద్‌లో అరెస్టు చేసి, జడ్చర్లకు తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించారు.

ఇవీచూడండి: పెళ్లి విషయంలో మనస్పర్థలు... ప్రేమజంట ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.