రంగారెడ్డి జిల్లాలో శంషాబాద్ పోలీసులు నకిలీ విత్తనాల గుట్టురట్టు చేశారు. రూ.60 లక్షల విలువైన నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. రూ.77 లక్షల విలువైన గడువు తీరిన విత్తనాలు సీజ్ చేశారు.
వానాకాలం ప్రారంభమైనందున రైతులు సాగుకు సిద్ధమయ్యారు. వారి అవసరాన్ని ఆసరాగా చేసుకున్న కొంతమంది అక్రమార్కులు నకిలీ విత్తనాలను వారికి అంటగడుతున్నారు. ఇటీవలే నల్గొండ జిల్లాలో పోలీసులు భారీగా నకిలీ విత్తనాలు పట్టుకున్నారు. దాదాపు 6 కోట్ల రూపాయలు విలువ చేసే సీడ్స్ స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ విత్తనాల విక్రయాన్ని అరికట్టేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. రోజుకో కొత్త పంథా అనుసరిస్తూ అమాయక అన్నదాతలకు కేటుగాళ్లు నకిలీ, గడువు తీరిన విత్తనాలు అంటగడుతూ వారికి నష్టాలు చేకూరుస్తున్నారు.
నకిలీ విత్తనాల విక్రయాలపై పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. రైతులెవరూ నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోకూడదని సూచిస్తున్నారు. ఎక్కడైనా నకిలీ సీడ్స్ విక్రయాలు జరిగినట్లు తెలిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని కోరుతున్నారు.
- ఇదీ చదవండి : రూ.6 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు పట్టివేత