Case On youtube Actress: ప్రముఖ యూట్యూబ్ నటి సరయుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ హోటల్ ప్రచారపాటలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని రాజన్న సిరిసిల్ల వీహెచ్‌పీ అధ్యక్షుడు చేపూరి అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రాజన్న సిరిసిల్ల పోలీసులు బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు.
VHP president complaint: హోటల్ ప్రచార పాటలో నటి సరయుతో పాటు మరికొందరు గణపతి బప్పా మోరియా బ్యాండ్‌ను తలకు ధరించారని అశోక్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దేవుడి బొమ్మలు ధరించి మద్యం సేవించి హోటల్‌ను సందర్శిస్తారనే సంకేతాన్ని ఆ ప్రమోషన్ పాటతో పంపుతున్నారని తెలిపారు. ఈ విధంగా హిందువుల మనోభావాలను కించపరిచేలా తీసినందుకు తగిన చర్యలు తీసుకోవాలని చేపూరి అశోక్ పోలీసులను కోరారు.
ఇదీ చూడండి: