మేడ్చల్ జిల్లా మల్కాజగిరి సంతోశ్‌రెడ్డి నగర్లో దారుణం చోటుచేసుకుంది. మల్కాజగిరి సూర్యప్రభ అపార్ట్మెంట్లో నివాసముండే రైల్వే ఉద్యోగి విజయ్‌కుమార్‌రెడ్డి అనే వ్యక్తిని ఓ గుర్తుతెలియని దుండగుడు హత్య చేశాడు.
విజయ్‌కుమార్‌రెడ్డి తల్లికి కరోనా సోకడంతో ఈరోజు ఉదయం తన తల్లిని ఆస్పత్రిలో చేర్పించి.. తిరిగి ఇంటికొచ్చాడు. అదే సమయంలో ఇంట్లోకి చొరబడిన ఓ గుర్తుతెలియని వ్యక్తి తన వెంట తెచ్చుకున్న కత్తితో విజయ్‌కుమార్‌రెడ్డి మెడపై నరికి చంపాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.
గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.