ETV Bharat / crime

Job Fraud: ఉద్యోగాల పేరుతో రూ. 10 కోట్లు వసూలు.. ముఠా అరెస్ట్ - Telangana news

Job Fraud: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసానికి పాల్పడిన ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలాంటి పరీక్షలు రాయకుండానే నేరుగా నియమాకపత్రాలు ఇస్తామని నమ్మించి నిరుద్యోగులను నట్టేట ముంచారు. దాదాపు 100 మంది నుంచి రూ. 10 కోట్ల వరకు నిందితులు వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

Rachakonda
Rachakonda
author img

By

Published : Mar 15, 2022, 5:24 AM IST

Job Fraud: ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. హన్మకొండకు చెందిన పొన్నాల భాస్కర్... సికింద్రాబాద్ కార్ఖానాలో నివాసం ఉండేవాడు. రైల్వే కాంట్రాక్టు పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు ఇప్పిస్తూ గుత్తేదారుల దగ్గర కమీషన్ తీసుకోవడం అతనిపని. ఈక్రమంలో దిల్లీలోని కొంతమంది రైల్వే అధికారులతో పరిచయం ఏర్పడింది. ఇదే అదనుగా తనకు రైల్వే నియామక మండలి ఉన్నతాధికారులతో పరిచయాలున్నాయని పలువురు నిరుద్యోగులను నమ్మించాడు. పరీక్ష రాయకుండానే నేరుగా రైల్వేతోపాటు భారత ఆహార సంస్థలోనూ ఉద్యోగాలిప్పిస్తానని నమ్మించాడు. ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 10 లక్షల వరకు వసూలు చేశాడు.

రైల్వే ఉద్యోగాల పేరుతో...

దిల్లీ, చెన్నై, అసోం, హైదరాబాద్‌లో ఏజెంట్లను నియమించుకొని భాస్కర్‌ ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. భాస్కర్‌ అనుచరుడు, సికింద్రాబాద్‌కు చెందిన స్థిరాస్తి వ్యాపారి రితేష్ ద్వారా దాదాపు 16మంది నుంచి కోటి వరకు డబ్బులు వసూలు చేశాడు. డబ్బులిచ్చి... నెలలు గడిచినా ఉద్యోగాలు రాలేదని నిరుద్యోగులు ఒత్తిడి చేయడంతో.... రైల్వే ఉన్నతాధికారుల పేర్లతో పొన్నాల భాస్కర్‌ నకిలీ నియామక పత్రాలు అందించాడు. ఉద్యోగాల్లో చేరడానికి దిల్లీ వెళ్లినవారు మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతను... ముంబయికి మకాం మార్చాడు. పోలీసులకు చిక్కకుండా స్నేహితుల ఇళ్లలో తలదాచుకున్నాడు. జవహార్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో భాస్కర్, రితేశ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారివద్ద నుంచి రూ. 9 లక్షల నగదు సహా... 25 లక్షల విలువైన రెండు కార్లు నకిలీ నియామక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. భాస్కర్‌ నిరుద్యోగులను నమ్మించే క్రమంలో వారిని దిల్లీలోని రైల్వే కార్యాలయం వద్దకు తీసుకెళ్లి అధికారులతో చనువుగా ప్రవర్తిస్తున్నట్లు నటించేవాడని పోలీసులు తెలిపారు.

ఇతర రాష్ట్రాల్లోనూ కేసులు...

భాస్కర్‌ కేవలం ఉద్యోగాల పేరుతోనే కాకుండా విదేశాల నుంచి వచ్చిన డబ్బులను... ఆర్బీఐ అధికారులు నిలిపేశారని... కొంత పన్ను కడితే ఖాతాలో జమ అవుతుందని నమ్మించి స్నేహితుల వద్ద డబ్బులు తీసుకున్నాడు. రైస్ పుల్లింగ్ మిషన్లు అమ్ముతానని పలువురిని నమ్మించి మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఇతర రాష్ట్రాల్లోనూ కేసులుండటంతో ఎప్పుడూ రహస్యంగా గడిపేవాడని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:High Court On BJP MLA's: స్పీకర్‌ను కలవండి.. భాజపా ఎమ్మెల్యేలకు హైకోర్టు సూచన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.