ETV Bharat / crime

అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్​ చేసిన రాచకొండ పోలీసులు - rachakonda commissionerate latest news

పగటి వేళలో కారులో తిరుగుతూ తాళం వేసిఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి బంగారు, వెండి ఆభరణాలు సహా రూ. 36 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Rachakonda police arrest gang of interstate robbers
అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్​ చేసిన రాచకొండ పోలీసులు
author img

By

Published : Feb 23, 2021, 10:39 PM IST

హైదరాబాద్​లో పట్టపగలే చోరీలకు పాల్పడుతున్న ఉత్తరప్రదేశ్​కు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ. 25 లక్షల విలువచేసే బంగారు, వెండి ఆభరణాలు, రూ. 36 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

సికింద్రాబాద్ పీఓటీ మార్కెట్​లో అనుమాదాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను మల్కాజిగిరి సీసీఎస్, నాచారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో తాము మూడు ఇళ్లలో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. నిందితులు పగటి సమయంలో తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి.. ఇనుపరాడ్డుతో తలుపులు బద్దలు కొట్టి చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు చెప్పారు. ఈ కేసులో రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో వ్యక్తిని అరెస్టు చేశామని పేర్కొన్నారు. హబ్సీగూడలో చోరికి గురైన తమ ఆభరణాలను తిరిగి అప్పజెప్పినందుకు ఓ ఇంటి యజమాని సీపీ మహేష్ భగవత్​ను​ కలసి ధన్యవాదాలు తెలియజేశారు.

Rachakonda police arrest gang of interstate robbers
అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్​ చేసిన రాచకొండ పోలీసులు

ఇదీ చదవండి: ట్రాలీ బోల్తా పడి కార్మికుని మృతి, ఒకరి పరిస్థితి విషమం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.