ETV Bharat / crime

స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో మోసం.. ఇద్దరు అరెస్ట్ - స్టాక్ మార్కెట్​లో పెట్టుబడి పేరుతోో మోసం

Fraud in the stock market: స్టాక్ మార్కెట్​లో పెట్టుబడుల పేరుతో మోసం చేసిన ఇద్దరిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. గొలుసుకట్టు వ్యాపారం పేరుతో ఇప్పటికే పలువురిని మోసంచేసినట్లు పోలీసులు గుర్తించారు.

cheating case
సైబర్ క్రైం మోసగాళ్లు
author img

By

Published : Mar 9, 2022, 10:58 PM IST

Fraud in the stock market: పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని నెల్లూరు జిల్లా కలిగిరి మండలానికి చెందిన బండ్లమూడి రవి.. రాజేంద్రనగర్​లోని అత్తాపూర్​లో నివాసం ఉంటున్నాడు. గొలుసుకట్టు వ్యాపారం పేరుతో ఇప్పటికే పలువురిని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. లక్నోకు చెందిన సందీప్, వీర్​తో చేతులు కలిపి పలు వెబ్​సైట్లు తెరిచారని పేర్కొన్నారు. ములుగు జిల్లా మంగపేటకు చెందిన వేములవాడ రఘు.. రవికి సహకరించాడు. ఇద్దరూ కలిసి గంపగుత్త సందేశాలు పంపారని పోలీసులు తెలిపారు. స్టాక్ మార్కెట్లో​ పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వచ్చేలా చేస్తామంటూ ప్రకటనల్లో నమ్మించారన్నారు. ఈ ప్రకటనలు చూసి మల్కాజ్ గిరికి చెందిన సుబ్రమణ్యం, నగేష్ కలిసి విడతల వారీగా 11లక్షల రూపాయలను బండ్లమూడి రవి చెప్పిన ఖాతాలో జమ చేశారని వెల్లడించారు.

మోసపోయానని...

కొన్ని నెలలు ఎదురు చూసినా ఎలాంటి లాభాలు రాలేదు. రవి, రఘుని సంప్రదించేందుకు ప్రయత్నించగా ఫోన్ స్విచ్​ఆఫ్ రావడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు.. సాంకేతికత ఆధారంగా నిందితులను గుర్తించారు.

ఇదీ చదవండి:CBI raids in Nalgonda: పోస్టల్ ఉద్యోగులపై సీబీఐ దాడులు.. ఏం జరిగిందంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.