YS Viveka murder case: మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో ముగ్గురు నిందితులకు పులివెందుల కోర్టు మరోసారి రిమాండు పొడిగించింది. శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డిల రిమాండును ఫిబ్రవరి 8వ తేదీకి పొడిగిస్తూ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ముగ్గురు నిందితులను కడప జైలు నుంచే ఆన్ లైన్ ద్వారా పులివెందుల మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులు కడప కేంద్ర కారాగారంలో రిమాండు ఖైదీలుగా ఉన్నారు.
ఇదీ చదవండి : ఎంపీ అర్వింద్ వాహనంపై రాళ్లతో దాడి చేసిన తెరాస శ్రేణులు
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం