Hyderabad Pub Case: పుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసు కస్టడీ రిపోర్ట్ వివరాలను పోలీసులు వెల్లడించారు. నిందితులు అనిల్, అభిషేక్‌లను 36 గంటలు ప్రశ్నించినట్లు పోలీసులు తెలిపారు. ఏడాది వ్యవధిలో కుటుంబంతో అభిషేక్ రెండుసార్లు విదేశాలకు వెళ్లాడని.. ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, ఐపీఎల్ చూసేందుకు విదేశాలకు వెళ్లినట్లు చెప్పాడని వెల్లడించారు. అభిషేక్ కాల్ డేటాలో ఉన్న అందరి గురించి ఆరా తీశామన్న పోలీసులు.. డ్రగ్ విక్రేతలతో అభిషేక్‌కు సంబంధాలున్నట్లు ఆధారాలు లభించలేదన్నారు. డ్రగ్ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని అభిషేక్ చెప్పాడని.. పబ్‌లోకి డ్రగ్స్ ఎలా వచ్చాయో తనకు తెలియదన్నాడని రిపోర్టులో వివరించారు.
పబ్‌లో ప్రవేశం కోసం తనకు రోజు అనేక ఫోన్లు వస్తుంటాయని అభిషేక్ చెప్పాడన్నారు. పబ్‌లో కొకైన్ విక్రయానికి సంబంధించి ఆధారాలు లభించలేదన్నారు. గత మూడేళ్ల అభిషేక్ కాల్‌డేటాను పరిశీలించామని.. నెలలుగా పబ్ లీజ్ తీసుకొని నడుపుతున్నట్టు అభిషేక్ తెలిపాడని రిపోర్ట్‌లో పోలీసులు తెలిపారు. పబ్‌లో సీసీ కెమెరాల్లోను ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. పబ్‌కు వచ్చే హైప్రొఫైల్ కస్టమర్స్ కోసమే యాప్ అని చెప్పారని వెల్లడించారు. మంచి ప్రొఫైల్ ఉంటేనే పబ్‌లోకి అనుమతిస్తామన్నారని నిందితులు తెలిపినట్లు పోలీసులు కస్టడీ రిపోర్టులో పేర్కొన్నారు. వయసు ధ్రువీకరణ పత్రం చూశాకే లోపలికి పంపిస్తామన్నాడని.. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో వస్తే తామేమీ చేయలేమని అభిషేక్ చెప్పినట్లు కస్టడీ రిపోర్టులో పోలీసులు వివరించారు.
ఇవీ చదవండి: