మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో ఆన్లైన్ ద్వారా వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న ముఠాలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సభ్యులు అమీర్, సందీప్, మనీశ్ గోయల్‌ను మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మరొక నిర్వాహకుడు రాకేశ్ పరారయ్యాడు.
ఇద్దరు యువతులను రక్షించి రెస్క్యూ హోంకి తరలించారు. నిర్వాహకుల నుంచి 3 చరవాణులు, ఒక బైక్, రూ.2,830 నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి: రుణ యాప్‌ల కేసులో మరో నలుగురి అరెస్ట్