ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో యువతిపై సామూహిక అత్యాచారం కేసుపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. సీతానగరం ప్రాంతంలో ఉండే పాత నేరస్థులను విచారిస్తున్నారు. మరికొందరి కదలికలపై నిఘా పెట్టారు. ఘటన జరిగిన రోజు వారు ఎక్కడున్నారనే అంశంపై సమాచారం సేకరిస్తున్నారు.
విచారణలో పోలీసులకు కీలక సమాచారం లభ్యమైనట్లు తెలుస్తోంది. నిందితులను బాధితురాలు గుర్తించినట్లు సమాచారం. వీరిపై గతంలో పుష్కర ఘాట్లలో ఒంటరిగా ఉన్న వారిపై దాడులు చేసి దోపిడిలకు పాల్పడిన కేసులున్నాయని చెబుతున్నారు. ఈ ఘటనలో వారి ప్రమేయం ఏ మేరకు ఉందనే అంశంపై పోలీసులు కూపీ లాగుతున్నారు. పూర్తి ఆధారాలతో నిందితులను పట్టుకునేందుకు యత్నిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
ఇదీచూడండి: కృష్ణా నది తీరంలో ప్రేమజంటపై దాడి.. యువతిపై అత్యాచారం!