ETV Bharat / crime

దారుణం.. కరోనా మందంటూ మాత్రలిచ్చి బాలికపై అత్యాచారం

ఏపీలోని కాకినాడ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కరోనా మందుపేరిట మాత్రలిచ్చి.. ఓ ప్రైవేట్ హాస్టల్​ నిర్వాహకుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

దారుణం.. కరోనా మందంటూ మాత్రలిచ్చి బాలికపై అత్యాచారం
దారుణం.. కరోనా మందంటూ మాత్రలిచ్చి బాలికపై అత్యాచారం
author img

By

Published : Jun 5, 2022, 11:45 AM IST

Rape: ఆంధ్రప్రదేశ్​లో మహిళలు, బాలికలపై దురాఘతాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కాకినాడ జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలికపై ప్రైవేట్ హాస్టల్ నిర్వాహకుడు విజయకుమార్‌ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొన్ని నెలలుగా బాలికపై అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు తేలింది. కరోనా నివారణ మందు పేరిట మత్తు మందు ఇచ్చి దారుణానికి తెగబడినట్లు బాలిక తెలిపింది. నిందితుడి అఘాయిత్యంతో బాలిక గర్భం దాల్చిందని.. ప్రస్తుతం ఆమెకు గర్భస్రావమైనట్లు వైద్యులు నిర్ధారించారు.

ప్రస్తుతం బాధిత బాలికను ఓ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు.. పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

ఇవీ చూడండి:

మాయమాటలు చెప్పి 12 ఏళ్ల బాలిక కిడ్నాప్.. ఇద్దరు నిందితుల అరెస్ట్​

జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో మరో ఇద్దరు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.