ETV Bharat / crime

ప్రైవేట్ పాఠశాలలో వార్డెన్‌ నిర్వాకం.. విద్యార్థి ప్రాణం బలి - Death of a student in a private school latest news

Student Died In School in Thimmapur : ఓ ప్రైవేట్ పాఠశాలలో వార్డెన్ నిర్వాకం వల్ల ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పొయాడు. పాఠశాల ఆవరణలో ఉన్న బావిలో చెత్తను తొలగించాలని.. వార్డెన్ అయిదుగురు విద్యార్థులను బావిలోకి దింపాడు. అనంతరం మిగిలిన విద్యార్థులు బయటకు రాగా శ్రీకర్‌ అనే విద్యార్థి బావిలో జారిపడి గల్లంతయ్యాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

Student Died In School
Student Died In School
author img

By

Published : Dec 5, 2022, 10:48 AM IST

Student Died In School in Thimmapur : వార్డెన్‌ నిర్వాకానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది. విద్యార్థులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌ జిల్లా జూలపల్లి మండలం తేలుకుంట గ్రామానికి చెందిన శ్రీనివాస్‌, రాధ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. శ్రీనివాస్‌ హైదరాబాద్‌లో డ్రైవింగ్‌ స్కూల్‌ నిర్వహిస్తూ అక్కడే భార్య, కుమార్తెతో ఉంటున్నారు. కుమారుడు మారం శ్రీకర్‌ (13) తిమ్మాపూర్‌ మండలం రామకృష్ణకాలనీలో అమ్మమ్మ వద్ద ఉండి ఓ ప్రైవేటు పాఠశాలలోని హాస్టల్‌లో ఉంటూ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు.

ఆదివారం సాయంత్రం పాఠశాల ఆవరణలోని బావిలో చెత్త తొలగించాలంటూ శ్రీకర్‌తో పాటు అయిదుగురు విద్యార్థులను వార్డెన్‌ బావిలో దింపాడు. అనంతరం మిగిలిన విద్యార్థులు బయటకు రాగా శ్రీకర్‌ బావిలో జారిపడి గల్లంతయ్యాడు. తోటి విద్యార్థులు అరవగా వార్డెన్‌ ఘటన స్థలం నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసు, అగ్నిమాపక సిబ్బంది గంట పాటు శ్రమించి శ్రీకర్‌ మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహం వద్ద శ్రీకర్‌ కుటుంబ సభ్యులు రోదించిన తీరు అందరినీ కలిచివేసింది. విద్యార్థి సంఘాలు పాఠశాల వద్ద బాధిత కుటుంబ సభ్యులతో కలిసి ధర్నాకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఘటనపై ఫిర్యాదు అందాల్సి ఉందని, స్కూల్‌ యాజమాన్యం అందుబాటులో లేదని ఎస్సై ప్రమోద్‌రెడ్డి పేర్కొన్నారు.

ఇవీ చదవండి: ఆటో బోల్తా.. నలుగురు అయ్యప్ప భక్తులు దుర్మరణం

భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు కన్నతండ్రిని చంపిన కొడుకు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.