ETV Bharat / crime

Suicide: హాస్టల్ నిర్వాహకుడి ఆత్మహత్య.. సూసైడ్ నోట్​లో ఏముందంటే... - హైదరాబాద్‌ జిల్లా వార్తలు

కరోనా మహమ్మారి కారణంగా ప్రైవేట్‌ హాస్టల్ నిర్వహకుల పరిస్థితి దయనీయంగా మారింది. నిర్వహణ భారం అధికంగా కావడంతో హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్‌ హాస్టల్ యజమాని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Suicide
Suicide
author img

By

Published : Oct 30, 2021, 12:57 PM IST

Updated : Oct 30, 2021, 1:05 PM IST

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఓ ప్రైవేట్​ హాస్టల్ నిర్వాహకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నారాయణ అనే వ్యక్తి వినాయక నగర్‌లో పీజీ హాస్టల్‌ను నిర్వహిస్తున్నాడు. లాక్​డౌన్​ సమయంలో విద్యార్థులు లేకపోవడంతో నిర్వహణ భారంగా మారింది. కొవిడ్‌ తగ్గుముఖం పట్టినప్పటికి హాస్టల్ సరిగా నడవడం లేదు. దానికి తోడు భవన యజమాని భూపాల్ రెడ్డి ఇంటి అద్దె కట్టాలని ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. ఇంట్లో వస్తువులను, వంట సామానులను రోడ్డు మీద వేస్తామని బెదిరించాడు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన నారాయణ సుసైడ్ నోట్ రాసి... ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

సుసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న హాస్టల్ నిర్వాహకుడు

నారాయణ మృతికి కారణం భవన యజమానేనని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. వెంటనే భూపాల్ రెడ్డిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని హాస్టల్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్‌ చేశారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: Selfie Suicide: భర్తకు వీడియోకాల్ చేసి ఉరేసుకుంది... ఎందుకంటే...

Last Updated : Oct 30, 2021, 1:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.