Private Employee Suicide: కుటుంబ కలహాల కారణంగా తీవ్ర మనస్తాపం చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్ బేగంపేట్‌లోని ప్రకాశ్‌నగర్ మెట్రో స్టేషన్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్‌కు చెందిన రాజు.. ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం(ఫిబ్రవరి 12న) రాత్రి సమయంలో ప్రకాశ్‌నగర్ చేరుకున్న రాజు.. మెట్రోస్టేషన్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన రాజును స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈరోజు(ఫిబ్రవరి 13) ఉదయం రాజు మృతి చెందాడు.
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు రాజు ఆత్మహత్య చేసుకున్న తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. రాజు ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు.
ఇదీ చూడండి: