ETV Bharat / crime

అంబులెన్స్ డ్రైవర్ల అరాచకం.. డబ్బుల కోసం మృతదేహం వద్ద లొల్లి - అంబులెన్స్ డ్రైవర్ల అరాచకం

Anarchy Private Ambulance Drivers: ఎవరైనా చనిపోతే.. తమకు తోచిన విధంగా సాయం చేస్తారు. కానీ గూడూరులో ప్రైవేట్​ అంబులెన్స్​ డ్రైవర్లు మానవత్వం లేకుండా ప్రవర్తించారు. డబ్బుల కోసం మృతుడి బంధువులను ఇబ్బందుల పాలు చేశారు. మీరడిగినంత ఇచ్చుకోలేమని బ్రతిమలాడినా కనికరించలేదు.. పైగా వేరే అంబులెన్స్​ తీసుకొస్తే ఆ డ్రైవర్​పై దాడికి పాల్పడ్డారు.

అంబులెన్స్ డ్రైవర్ల అరాచకం.. మృతదేహం వద్ద లొల్లి

author img

By

Published : Sep 21, 2022, 5:21 PM IST

Anarchy Private ambulance drivers: ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతి జిల్లాలో గూడూరు ప్రభుత్వాస్పత్రి వద్ద ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు అరాచకం సృష్టించారు. మృతదేహాన్ని ఇతర వాహనాల్లో తరలించకుండా అడ్డుకున్నారు. కోట మండలం తిమ్మనాయుడుపాలెం గ్రామానికి చెందిన యువకుడు.. నిన్న మనుబోలు సమీపంలో వాహన ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. గూడూరు ప్రభుత్వాస్పత్రిలో మృతదేహానికి పంచనామా నిర్వహించారు.

మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లేందుకు ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్లు రూ.4 వేలు డిమాండ్‌ చేశారని బాధితులు ఆరోపించారు. 17 కి.మీ. దూరానికి రూ.4 వేలు అడగడమేంటని బతిమిలాడినట్లు తెలిపారు. కూలీ పనులు చేసుకునేవాళ్లమని చెప్పినా అంబులెన్స్ డ్రైవర్లు కనికరించలేదని వాపోయారు. మరో వాహనం పిలుచుకుంటే అంబులెన్స్‌ డ్రైవర్లు అడ్డుకున్నారని బాధితులు చెప్పారు.

కోట నుంచి తెలిసినవారి అంబులెన్స్​ను పిలిపించుకోగా.. అందులో మృతదేహాన్ని తీసుకెళ్లనీయకుండా డ్రైవర్లు అడ్డుకున్నారని.. ఆ అంబులెన్స్ డ్రైవర్​పై దాడి చేశారని ఆరోపించారు. ప్రైవేటు అంబులెన్స్‌ డ్రైవర్లపై గూడూరు పీఎస్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. పోలీసుల జోక్యంతో మరో వాహనంలో మృతదేహాన్ని తరలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.