ETV Bharat / crime

ప్రభుత్వాధికారులపై వైసీపీ సర్పంచ్ రౌడీయిజం - యడవల్లి వైసీపీ సర్పంచ్‌ అనుచిత వ్యాఖ్యలు

Yadavalli YCP Sarpanch Serious on Officials: ''మీ ఇష్ట ప్రకారం చేస్తే నడవదు.. నేను చెప్పినట్లే చేయాలి. లేదంటే కష్టమని..'' ఏపీ ప్రకాశం జిల్లా యడవల్లి వైసీపీ సర్పంచ్‌.. ప్రభుత్వ అధికారులకు ఫోన్ చేసి మరీ దుర్భాషలాడారు. సర్పంచ్ హెచ్చరికలతో తీవ్ర ఆందోళనకు గురైన తహసీల్దార్, సిబ్బంది తమకు రక్షణ కల్పించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వాధికారులపై వైసీపీ సర్పంచ్ రౌడీయిజం

author img

By

Published : Dec 29, 2022, 3:26 PM IST

Yadavalli YCP Sarpanch Serious on Officials: ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా యడవల్లి వైసీపీ సర్పంచ్‌.. కనిగిరి తహసీల్దార్ సహా వీఆర్వో, కార్యదర్శిని బెదిరించారు. అనుమతుల్లేవంటూ యడవల్లి సర్పంచి కాసుల గురవయ్య వెంచర్లలోని.. రాళ్లను రెవెన్యూ సిబ్బంది తొలగించారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సర్పంచ్‌.. మీ ఇష్టప్రకారం చేస్తే నడవదు.. నేను చెప్పినట్లే చేయాలి. లేదంటే కష్టమని.. పంచాయతీ కార్యదర్శి అరవిందకు ఫోన్‌ చేసి అసభ్యపదజాలంతో దూషించారు.

కలెక్టర్‌ సమీక్షలో ఉన్న తహసీల్దారు పుల్లారావుకు ఫోన్‌చేసి.. ఫోన్‌ చేస్తే ఎందుకు ఎత్తలేదు? ఇష్టప్రకారం చేస్తున్నావేంటి? బదిలీ చేయిస్తానని బెదిరించారు. కులం పేరుతో దూషించారు. సర్పంచ్ హెచ్చరికలతో తీవ్ర ఆందోళనకు గురైన తహసీల్దారు, సిబ్బంది తమకు రక్షణ కల్పించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వాధికారులపై వైసీపీ సర్పంచ్ రౌడీయిజం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.