ETV Bharat / crime

లాఠీ కాఠిన్యం... విచారణ పేరుతో దళిత మహిళను చిత్రహింసలు.! - దళిత మహిళను పోలీసులు చిత్రహింసలు

Police tortured the sc woman: జై భీమ్​ సినిమాలో విచారణ పేరిట అమాయకులను చిత్రహింసలు పెట్టిన తరహా ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా తారసపడుతూనే ఉన్నాయి. మాకే పాపం తెలీదు మొర్రో అని బాధితులు మొత్తుకున్నా పోలీసులు వారి లాఠీలకు పని చెబుతున్నారు. తీరా వారి తప్పు లేదని తెలిశాక.. కప్పిపుచ్చుకునేందుకు యత్నిస్తున్నారు. తాజాగా ఏపీలో విచారణ పేరిట పోలీసులు ఓ దళిత మహిళను చిత్రహింసలకు గురిచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

Police tortured the sc woman
దళిత మహిళను చిత్రహింసలు
author img

By

Published : Jan 22, 2022, 4:59 PM IST

Police tortured the sc woman: ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. విచారణ పేరుతో ఎస్సీ మహిళపై పోలీసులు దాష్టికం ప్రదర్శించారు. నగరంలోని లక్ష్మీ నగర్ కాలనీకి చెందిన ఉమా మహేశ్వరి.. చిత్తూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణు గోపాల్ రెడ్డి ఇంట్లో ఏడాది కాలంగా పని చేస్తోంది. వేణు గోపాల్ రెడ్డి ఇంట్లో రూ. 2 లక్షల నగదు కనిపించకపోవడంతో పని మనిషి ఉమా మహేశ్వరిని ప్రశ్నించారు. డబ్బులు కనిపించక పోవడానికి తనకు ఎలాంటి సంబంధం లేదని ఉమా మహేశ్వరి చెప్పినా వినకుండా పోలీసులను పిలిపించారు.

లాఠీలతో తీవ్రంగా కొట్టి

ఈ నెల 18 న చిత్తూరు ఒకటో పట్టణ పోలీసు స్టేషన్​కు తనను పిలిపించి చేతి వేలి ముద్రలు తీసుకుని పోలీసులు పంపించేసినట్లు ఉమా మహేశ్వరి మీడియాకు తెలిపారు. అనంతరం 19 వ తేదీ తనను మళ్లీ పోలీసు స్టేషన్​కు పిలిచి కాళ్లూచేతులు కట్టేసి లాఠీలతో తీవ్రంగా కొట్టినట్లు వెల్లడించారు. స్పృహ కోల్పోయే వరకు తనను పోలీసులు కొట్టారని ఆమె తెలిపారు. అనంతరం ఎస్సై వచ్చిన తరువాత తనను పోలీసులు విడిచి పెట్టారని చెప్పారు. తీవ్ర గాయాలపాలైన ఉమా మహేశ్వరి అస్వస్థతకు గురికావడంతో ఆమె భర్త, తల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఆమె వెల్లడించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

తర్వాత బుజ్జగించారు

తనను పలుమార్లు కులం పేరుతో పోలీసులు దూషించారని బాధితురాలు ఆరోపించారు. అనంతరం దొంగతనం సంఘటనకు తనకు ఎలాంటి సంబంధం లేదని విచారణలో తెలియడంతో పోలీసులు తనను బుజ్జగించినట్లు చెప్పారు. తనకు తగిలిన గాయాలకు చికిత్స చేయించి పరిహారం ఇస్తామని పోలీసులు చెప్పినట్లు వెల్లడించారు. ఈ విషయం బయట ఎవరికీ చెప్పకూడదని బెదిరించినట్లు ఉమా మహేశ్వరి పేర్కొన్నారు. అకారణంగా తనను దొంగతనం పేరుతో చిత్రహింసలు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనకు న్యాయం చేయాలని అభ్యర్థించారు.

ఇదీ చదవండి: Dalithabandhu: రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లో దళితబంధు పథకం అమలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.