ETV Bharat / crime

saidabad incident: రాజు ఎక్కడున్నాడు? తప్పించుకోవడానికి సహకరించింది ఎవరు? - ఆరేళ్ల చిన్నారిపై రేప్​

సైదాబాద్ హత్యాచారం కేసులో నిందితుడు రాజు కోసం పోలీసుల బృందాలు గాలిస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు జనగామ, యాదాద్రి జిల్లాల్లో పోలీసుల గాలిస్తున్నారు. నిందితుడి తల్లి, అక్కాబావలను ప్రశ్నిస్తున్నారు. నిందితుడు తప్పించుకునేందుకు స్నేహితుడి సహకారం చేసినట్లు గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

saidabad incident
saidabad incident
author img

By

Published : Sep 14, 2021, 10:02 AM IST

నగరంలో ఆరేళ్ల చిన్నారి పాశవిక హత్యాచార ఘటనపై అనుమానాలు ఇంకా కొనసాగుతున్నాయి. అత్యాచారానికి పాల్పడింది పల్లంకొండ రాజు మాత్రమే అయినా.. అతడిని తప్పించేందుకు బస్తీవాసి ఒకరు సహకరించారని తెలిసింది... ఆ వ్యక్తే రాజును తప్పించాడని పోలీసులు భావిస్తున్నారు. మరోపక్క కొద్ది గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నామంటూ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో చేసిన వ్యాఖ్యలపై పోలీసులను ప్రశ్నిస్తుండగా.. పోలీసులు మాత్రం రాజు ఆచూకీ ఇంకా లభించలేదని, పది బృందాలతో గాలిస్తున్నామంటున్నారు.

పారిపోవాలంటూ..

తల్లిదండ్రులతో ఉంటున్న చిన్నారిపై కన్నేసిన రాజు... నాలుగు రోజుల క్రితం చాక్లెట్‌ ఆశ చూపించి బాలికను తీసుకెళ్లాడు. పాశవికంగా చిన్నారిని హత్యచేసి శవాన్ని తన గదిలో ఉంచి తాళం వేసి బయటకు వచ్చాడు. బాలిక తల్లిదండ్రులు అతడిపై అనుమానం వ్యక్తం చేసినా పోలీసులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. చిన్నారి కోసం పోలీసులు, తల్లిదండ్రులు, స్థానికులు అన్నిచోట్లా గాలిస్తున్నప్పుడు రాజు స్నేహితుడు అతడిని పక్కకు తీసుకెళ్లి.. ఇక్కడి నుంచి పారిపోవాలంటూ చెప్పినట్లు తెలిసింది.

శాస్త్రీయ ఆధారాలతో వేట..

అక్కడున్నవారు వెంటనే గుర్తుపట్టకుండా ఉండేందుకు టోపీ, మాస్కు, తువ్వాలు, ఒక జత దుస్తులతో కూడిన సంచిని ఇచ్చాడంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. వీరి ఆరోపణలకు బలం చేకూర్చుతూ అక్కడున్న సీసీ కెమెరాలో రాజు, అతడి స్నేహితుడు వెళ్తున్న దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. మరోవైపు నిందితుడు రాజు గంజాయి పీల్చడంతో పాటు గుడుంబా ఎక్కువగా తాగుతుంటాడని, ఎక్కడపడితే అక్కడ పడిపోతాడని పోలీసులు చెబుతున్నారు. అతడి వద్ద చరవాణి లేకపోవడంతో ఎక్కడున్నాడో తెలుసుకోవడం కష్టంగా మారిందని వివరిస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలిస్తున్నామని, శాస్త్రీయ ఆధారాలతో పరిశోధిస్తున్నామంటున్నారు. ఫుటేజిలో ఉన్న వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నాడని విశ్వసనీయంగా తెలిసింది.

సంబంధిత కథనాలు: బాలిక అనుమానాస్పద మృతి.. తక్షణ సాయం అందించిన కలెక్టర్

బాలిక అనుమానాస్పద మృతి.. నిందితుడిని ఎన్​కౌంటర్​ చేయాలని ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.