ETV Bharat / crime

కథ అడ్డం తిరిగింది.. కటకటాల పాలయ్యాడు - Vizianagaram district latest news

చాలా మంది కష్టపడి సంపాదించలేక.. అక్రమ మార్గంలో సంపాదించాలనుకుంటారు. దానికోసం బెదిరింపులకు పాల్పడటం లాంటి పనులు చేస్తుంటారు. ఇక్కడ కూడా ఓ యువకుడు అలానే సంపాదించాలనుకున్నాడు. అయితే నార్మల్​గా బెదిరిస్తే పనులు కావనుకున్న యువకుడు.. గన్​తో ట్రై చేద్దామనుకున్నాడు. అనుకున్నదే తడవుగా గన్​ను కూడా సంపాదించాడు. కానీ ఊహించని రీతిలో పోలీసులకు దొరికాడు. ఇదెక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

AP
AP
author img

By

Published : Jan 19, 2023, 5:08 PM IST

ఓ యువకుడు కోడిగుడ్ల వ్యాపారం చేస్తుంటాడు. డబ్బు ఎక్కువ కావాలనే ఆశతో.. ఇతరులపై బెదిరింపులకు దిగుదామని ప్లాన్ చేశాడు. నార్మల్​గా బెదిరిస్తే ఎవరూ లెక్కచేయరు అనుకున్నాడేమో.. వరుసకు బావ అయినా వ్యక్తి దగ్గర గన్​ తీసుకున్నాడు. అయితే మనోడికి ఓ సందేహం వచ్చింది. అదేంటంటే ఆ గన్​ పని చేస్తుందా లేదా అని. ఇంకేముంది అర్ధరాత్రి దానిని టెస్ట్​ చేసేందుకు సిద్ధమయ్యాడు. అనుకున్నదే తడవుగా మరో వ్యక్తితో కలిసి.. బైక్​పై వెళ్లాడు. ఇక్కడే ఓ ట్విస్ట్ చోటుచేసుకుంది.

ఆంధ్రప్రదేశ్​లోని రాజమహేంద్రవరం కొత్తపేటకు చెందిన కేరళ సత్యనారాయణ అలియాస్ శ్రీనివాస్ కోడిగుడ్ల వ్యాపారం చేస్తున్నాడు. వరgసకు బావైన విజయనగరానికి చెందిన బొత్స మోహన్ నుంచి 9 ఎమ్​ఎమ్​ యుఎస్ మేడ్ తుపాకీని తెచ్చుకున్నాడు. ఈ గన్‌ చూపించి బెదిరించి డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించుకున్నాడు. తుపాకీ పేలుతుందో.. లేదో పరిశీలించేందుకు.. ఇంటి పక్కనున్న ఆటో డ్రైవర్ అంబాళ్ల హరిసూర్యతో కలిసి ద్విచక్ర వాహనంపై గురువారం రాత్రి బయటకు వచ్చాడు.

అయితే ఈ మార్గంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వీరిపై అనుమానంతో తనిఖీ చేయగా.. గన్​తో అడ్డంగా దొరికిపోయాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేప్టటారు.

కథ అడ్డం తిరిగింది.. కటకటాల పాల్లయ్యాడు

ఇవీ చదవండి: మహిళా అసిస్టెంట్ లోకోపైలెట్‌ మిస్సింగ్‌ కలకలం

మహిళా కమిషన్ చైర్​పర్సన్​కు వేధింపులు.. కారుతో ఈడ్చుకెళ్లిన వ్యక్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.