ETV Bharat / crime

రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల దాడులు.. రూ.కోట్ల విలువైన గంజాయి పట్టివేత

author img

By

Published : Jun 27, 2021, 12:14 PM IST

అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిరోధక వారోత్సవాల్లో భాగంగా ఆంధ్ర ప్రదేశ్​ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో దాడులు చేయగా.. కోట్ల రూపాయల విలువైన గంజాయి పట్టుబడింది. నిందితులపై కేసులు నమోదు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల దాడులు.. రూ.కోట్ల విలువైన గంజాయి పట్టివేత
రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల దాడులు.. రూ.కోట్ల విలువైన గంజాయి పట్టివేత

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులు, పోలీసులు.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై దాడులు కొనసాగిస్తున్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక వారోత్సవాల సందర్భంగా దాడులను మరింత ముమ్మరం చేసి.. గంజాయి, అక్రమ మద్యం రవాణాల గుట్టు తేలుస్తున్నారు.

విశాఖ జిల్లాలో...

సప్పర్ల సమీపంలోని సీలేరు తనిఖీ కేంద్రం వద్ద వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కోటి రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వ్యానులో 17 బస్తాల్లో ప్యాకింగ్ చేసిన 540 కేజీల గంజాయి పట్టుబడింది. దళారులు డబ్బులు ఆశ చూపడంతో.. తెలంగాణకు చెందిన ఇద్దరు వ్యక్తులు గంజాయిని తరలింపుకు సిద్ధమయ్యారని పోలీసులు అన్నారు. విశాఖ ఏజెన్సీ గూడెంకొత్తవీధి మండలం గాలికొండ పంచాయతీలో గంజాయి కొనుగోలు చేసి ప్యాకింగ్ చేసి వస్తుండగా సీలేరు తనిఖీ కేంద్రం వద్ద పోలీసులకు పట్టుబడ్డారు. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా ముబిన్​పేట మండలం రాళ్లగుడ పల్లి గ్రామానికి చెందిన సంతోష్ కుమార్, సంగారెడ్డి జిల్లా అనంతసాగరం మండలం మియాపూర్ తండాకు చెందిన గణపతి నాయక్​పై కేసు నమోదు చేశామని వెల్లడంచారు.

తూర్పుగోదావరి జిల్లాలో...

జగ్గంపేట రామవరం వద్ద జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సుమారు 25 లక్షల రూపాయలు విలువ చేసే.. 250 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని రాజవొమ్మంగికి చెందిన ఈక సూరిబాబు, చింతపల్లి మండలం అన్నవరం గ్రామానికి చెందిన జమ్మల రాజేష్, విశాఖ జిల్లాకు చెందిన వంతల చంటిబాబు, రాజస్థాన్​కు చెందిన హనుమాన్ రామ్, మురళిరామ్​పై కేసు నమోదు చేశామని ఎస్సై లక్ష్మి తెలిపారు. ఈక సూరిబాబు, జమ్మల రాము, వంతల చంటిబాబు అనే ఈ ముగ్గురూ గంజాయిని తక్కువ రేటుకు కొని రాజస్థాన్ వెళ్లే వాహనాలకు కిరణ్ అనే మధ్యవర్తి సరఫరా చేస్తారని చెప్పారు. వారి నుంచి ఒక బొలేరో వాహనం, లారీ, బైకు, 1000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.

చిత్తూరు జిల్లాలో...

గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారును పోలీసులు తనిఖీ చేయగా.. 3 కిలోల గంజాయి దొరికింది. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని పాకాల సీఐ వెల్లడించారు. జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం... 2 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టామని చెప్పారు. బెంగళూరు, తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ... చిత్తూరు మీదుగా గంజాయి తరలిస్తున్నట్టు నిందితులు వెల్లడించారని తెలిపారు.

ఇదీ చూడండి: ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న ఆర్టీసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.