ETV Bharat / crime

fake cigarettes: నగరంలో నకిలీ సిగరెట్ల దందా.. రూ.2 కోట్ల ముడిపదార్థాలు స్వాధీనం - సిగరెట్ల దందా

సిగరెట్ల బ్రాండ్‌ పేపర్లున్నాయ్‌.. పొగాకు ఫిల్టర్‌ ఉంది... సిగరెట్‌ పెట్టెల బ్రాండ్‌ అట్టలున్నాయ్‌... జస్ట్‌ మనం పొగాకు నింపేసి మార్కెట్‌లో అమ్ముకుంటే చాలు. నెలకు రూ.కోట్లల్లో ఆదాయం.. అని గట్టిగా నిర్ణయించుకున్న అలంఖాన్‌ సోదరులు. గోల్డ్‌ఫ్లేక్, విల్స్, బర్కిలీ, బ్రిస్టల్‌ వంటి సిగరెట్లను విక్రయిస్తున్న ఐటీసీ కంపెనీకే మస్కా కొట్టేశారు. దీనిపై సమాచారం అందుకున్న హైదరాబాద్‌ దక్షిణమండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేసి ట్రూప్‌బజార్‌లోని ఓ గోదాంలో రెండు కోట్ల విలువైన ముడిపదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

fake cigarettes
నగరంలో నకిలీ సిగరెట్లు స్వాధీనం
author img

By

Published : Mar 12, 2022, 5:28 PM IST

నాసిరకం పొగాకుతో బ్రాండెడ్ సిగరెట్లను విక్రయిస్తూ ఐటీసీ కంపెనీకే మస్కా కొట్టేశారు హైదరాబాద్​ పాతబస్తీకి చెందిన ఆలంఖాన్ సోదరులు. ఆయా సిగరెట్ల ముడిపదార్థాలను సరఫరా చేస్తున్న మహ్మద్‌ అలంఖాన్‌.. తన సంపాదన కోసం బ్రాండెడ్‌ పేపర్లు, సిగరెట్‌ ఫిల్డర్లను ఎక్కువగా ముద్రించుకుని కొన్ని నెలలుగా మార్కెట్‌లో విక్రయిస్తున్నాడు. ఐటీసీ కంపెనీ అధికారులకు అనుమానం వచ్చేంత వరకూ ఈ వ్యవహారం జరుగుతోందని తెలీదు. ట్రూప్‌ బజార్‌లోని అలంఖాన్‌ గోదాంలో నాలుగురోజుల క్రితం పోలీసులు దాడులు చేసి రూ.2 కోట్ల విలువైన సిగరెట్లకు ముడిపదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అలంఖాన్‌ సోదరులు పారిపోవడంతో కొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఐటీసీ కంపెనీతో పాటు వేరే కంపెనీల సిగరెట్లూ ఇలాగే చేస్తున్నారా అనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు.

సినిమాను తలపించే డెన్‌

పొగాకు ఉత్పత్తుల్లో నాసిరకం ఐటీసీ సిగరెట్లు కలిసిపోయాయన్న ఫిర్యాదుతో దక్షిణమండలం టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రాఘవేంద్ర బృందం ట్రూప్‌బజార్‌లో అలంఖాన్‌ నిర్వహిస్తున్న యూసుఫ్‌ సప్లయింగ్‌ కంపెనీకి వెళ్లింది. లోపలికి వెళ్లి చూస్తే పోలీసులకు విస్తుపోయే దృశ్యాలు కనిపించాయి. సినిమాల్లో కనిపించే ప్రతి నాయకుల డెన్‌లా అట్టపెట్టెలు, సిగరెట్‌ బ్రాండ్‌ పేపర్లు, ఫిల్టర్లు, నాసిరకం పొగాకు సంచులు ఐదు వందలున్నాయి. ఒక్కో సంచిలో 25 కిలోల పొగాకు ఉంది. సిగరెట్లలో నాసిరకం పొగాకు నింపేందుకు ప్రత్యేక పరికరాలున్నాయి. ఇంతే కాదు.. గోదాంలో కొన్ని పాతకార్లు, వాటిల్లో కార్టన్లు ఉంచేందుకు స్థలం కూడా ఉంది. అనంతరం యూసుఫ్‌ సప్లయింగ్‌ కంపెనీకి సంబంధించిన రికార్డులను పరిశీలించగా.. ఒక్కటికూడా సక్రమంగా లేదని పోలీసులు వెల్లడించారు.

పెట్టుబడి పొగాకు మాత్రమే..

ఐటీసీ కంపెనీకి సిగరెట్ల ముడిపదార్థాలను సరఫరా చేస్తున్న అలంఖాన్, నసీర్‌ఖాన్‌లు రూ.కోట్లు సంపాదించేందుకు నకిలీ సిగరెట్ల వ్యాపారాన్ని ఎంచుకున్నారు. బయటి నుంచి కాస్త నాణ్యమైన పొగాకు కొని సిగరెట్లలో నింపి.. పాన్‌డబ్బాలతో పాటు హోల్‌సేల్‌ వ్యాపారులకు అనుమానం రాకుండా విక్రయిస్తున్నారు. ఐటీసీ కంపెనీ బ్రాండ్, ప్యాకింగ్‌ అంతా ఒకేలా ఉండడంతో కొన్నవారికి ఎవరికీ అనుమానం రాకుండా దందా కొనసాగిస్తున్నారు. పైగా బ్రాండ్‌ సిగరెట్లు గోల్డ్‌ఫ్లేక్, విల్స్, బ్రిస్టల్‌ల మార్కెట్‌ వాటా ఎక్కువ. అందువల్ల అలంఖాన్‌ సోదరులు ఐటీసీ బ్రాండ్‌ పేప సిగరెట్‌ ఫిల్టర్లతో ఏమాత్రం కష్టపడకుండా అమ్మేస్తున్నారు. అక్రమంగా రూ.కోట్లు సంపాదిస్తున్నారు. ఐటీసీ అధికారులు అలంఖాన్‌ గోదాంకు వెళ్లి అక్కడి ముడిపదార్థాలను తరచూ తనిఖీ చేయకపోవడం కూడా వారికి కలిసొచ్చినట్లైంది. పరారీలో ఉన్న అలంఖాన్‌ సోదరులను పట్టుకుంటేనే మరిన్ని విషయాలు వెలుగుచూసే అవకాశాలున్నాయి.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.