Police Raid On Pub: రాంగోపాల్‌పేట్ టకీలా పబ్‌పై పోలీసుల దాడి ఘటన మరవకముందే మరో హోటల్లో అశ్లీల నృత్యాలు చేస్తున్న వారిపై ఉత్తరమండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. సికింద్రాబాద్ బసేరా హోటల్లో ఉన్న ఔట్ స్వింగర్స్ పబ్‌లో తనిఖీలు చేపట్టారు. అశ్లీల నృత్యాలు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో దాడి చేసి... డ్యాన్సర్లు, పబ్ నిర్వాహకులతో సహా 10 మంది యువతులు, 28 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు.
స్థానిక గోపాలపురం పోలీసులతో పాటు మహిళ సిబ్బంది సహకారంతో పబ్‌లో ఉన్న యువతులను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పబ్ యజమానిపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇవీ చదవండి:family suicide: ఇద్దరు కుమార్తెలతో సహా దంపతుల ఆత్మహత్య