ETV Bharat / crime

కోడి పందేల స్థావరంపై ఎస్వోటీ పోలీసుల దాడి.. 10 మంది అరెస్ట్​ - cock fight

సంక్రాంతి పండుగ దగ్గరకు వచ్చింది.. నగరానికి శివారులో ఉన్న ప్రాంతం.. కార్లు, బైక్​లతో పలువురు బయలుదేరారు. సంచుల్లో ఉన్న కోళ్లను పందేల కోసం సిద్ధం చేశారు. బయటకి తీసి పందేలు నిర్వహిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించి 10 మందిని అరెస్టు చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలోని నాదర్​గుల్​లో జరిగింది.

కోడి పందేల స్థావరంపై ఎస్వోటీ పోలీసుల దాడి.. 10 మంది అరెస్ట్​

author img

By

Published : Jan 9, 2022, 5:54 PM IST

కోడి పందేల స్థావరంపై ఎస్వోటి పోలీసులు దాడులు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని నాదర్​గుల్​లో కోడి పందేలు నిర్వహిస్తున్న 10మందిని పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి నుంచి 13 పందెం కోళ్లు, రూ.49,080 నగదు, 36 పందెం కత్తులు, 8 చరవాణులు, నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

పందెం నిర్వహిస్తున్న ఆ 10 మందిని ఎస్వోటీ పోలీసులు ఆదిభట్ల పీఎస్​లో అప్పగించారు. గుట్టుచప్పుడు కాకుండా నాదర్​గుల్​లోని ఓ కాలనీలో గల ఓపెన్​ప్లాట్​లో కోడి పందేలు నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు.. ఆ స్థావరంపై దాడి చేసి వారిని పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కోడి పందేల స్థావరంపై ఎస్వోటీ పోలీసుల దాడి.. 10 మంది అరెస్ట్​

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.