ETV Bharat / crime

లైన్​మెన్​ నియామక పరీక్షలో అక్రమాలు.. పోలీసుల అదుపులో నలుగురు ఉద్యోగులు..! - Junior Linemen Recruitment Test question paper leak

Junior Linemen Recruitment Test: రాష్ట్రంలో ఈ నెల 17న నిర్వహించిన జూనియర్‌ లైన్‌మెన్ల నియామక పరీక్షలో జరిగిన అక్రమాలపై పోలీసులు దృష్టి సారించారు. తీగ లాగితే డొంక కదిలినట్లు ఈ కేసులో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఘట్​కేసర్​లోని కేంద్రంలో పరీక్ష రాసిన అభ్యర్థులకు ఓ ఇద్దరు విద్యుత్ శాఖ అధికారులు సమాధానాలు అందించినట్లు గుర్తించిన పోలీసులు.. వారికి ప్రశ్నపత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయన్న అంశంపై పరిశోధిస్తున్నారు.

జూనియర్‌ లైన్‌మెన్ల నియామక పరీక్షలో అక్రమాలపై పోలీసుల నజర్‌

author img

By

Published : Jul 24, 2022, 7:27 AM IST

Junior Linemen Recruitment Test: విద్యుత్తు శాఖలో జూనియర్‌ లైన్‌మెన్ల నియామక పరీక్షలో జరిగిన అక్రమాలపై పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. ఈ నెల 17న జరిగిన రాత పరీక్షలో కొందరు అభ్యర్థులకు సెల్‌ఫోన్‌ ద్వారా సమాధానాలు రావడాన్ని ఘట్‌కేసర్‌లోని ఓ పరీక్షకేంద్రం అధికారి గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీగలాగితే డొంక కదిలినట్లు ఆ పరీక్ష కేంద్రంలో పదుల సంఖ్యలో అభ్యర్థులకు సెల్‌ఫోన్ల ద్వారా సమాధానాలు వెళ్లినట్లు తెలిసింది.

మలక్‌పేటలో విధులు నిర్వహిస్తున్న ఏడీఈ ఫిరోజ్‌ ఖాన్‌, కోదాడలో సహాయ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సైదులు పరీక్ష రాసిన వారికి ఈ సమాధానాలు అందజేశారని రాచకొండ పోలీసులు గుర్తించారు. వీరిద్దరికీ పశ్నపత్రం ఎక్కడి నుంచి వచ్చిందన్న అంశంపై పోలీసులు పరిశోధిస్తున్నారు. మరో నలుగురు విద్యుత్‌ శాఖ అధికారులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

జూనియర్‌ లైన్‌మెన్‌ ఉద్యోగం ఇప్పిస్తానంటూ మలక్‌పేట ఏడీఈ ఫిరోజ్‌ఖాన్‌, లైన్‌మెన్లు శ్రీనివాస్‌, దస్రూనాయక్‌లు తనతో ఒప్పందం కుదుర్చుకుని రూ.లక్ష తీసుకున్నారని రంగారెడ్డి జిల్లాకు చెందిన లోక్యానాయక్‌ విద్యుత్‌ శాఖ నిఘా విభాగం అధికారులకు మూడు రోజుల క్రితం సమాచారం ఇచ్చారు. దీంతో విజిలెన్స్‌ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ముగ్గురినీ అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు.

జూనియర్‌ లైన్‌మెన్‌ ఉద్యోగాలిప్పిస్తామంటూ కొందరు అధికారులు నాలుగేళ్ల నుంచి దందా కొనసాగిస్తున్నారని హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆధారాలు సేకరించారు. ఇద్దరు సహాయ డిప్యూటీ ఇంజినీర్లు, నలుగురు సహాయ ఇంజినీర్లు, తొమ్మిది మంది లైన్‌మెన్లు అక్రమాలకు పాల్పడుతున్నారని తెలుసుకున్నారు. ఇందులో ఏడీఈల్లో ఒకరు ఉమ్మడి నల్గొండ, మరొకరు హైదరాబాద్‌ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. వీరు నాలుగేళ్ల క్రితం పలువురు అభ్యర్థుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేశారని పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.