రంగారెడ్డి జిల్లా మంచిరేవుల ఫామ్‌హౌస్‌లో పేకాట కేసులో ప్రధాన నిందితుడు సుమన్ కుమార్ చౌదరి కస్టడీ విచారణ ముగిసింది. రెండు రోజుల కస్టడీలో భాగంగా నార్సింగి పోలీసులు పలు కీలక సమాచారాన్ని రాబట్టారు. అతని ఫోన్లోని వాట్సాప్ ఛాటింగ్‌ను పరిశీలించారు. పలు సందేశాలపై ఆరా తీశారు. ఎక్కడెక్కడ క్యాసినోలను నిర్వహించారని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో నేడు పోలీసులు.. సుమన్‌ను ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపరిచారు.
ఇవీ చూడండి:
- Naga shourya farmhouse case: ఫాంహౌస్ పేకాట కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
- Manchirevula farm house case: ప్రముఖుల మెప్పు కోసం నోరూరించే వంటకాలు.. సకల సౌకర్యాలు..
- Naga shaurya farm house case: 'పేకాడదాం రండి'.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులకు ఆహ్వాన కార్డులు
- SOT police hyderabad: ఫామ్‌హౌస్‌లో పేకాట నిర్వహణపై ముమ్మర దర్యాప్తు
కస్టడీ సమయంలో హైదరాబాద్ శివారుల్లోని ఫామ్‌హౌస్‌లకు.. అతనికి ఉన్న లింకులపై ప్రశ్నల వర్షం కురింపించారు. పలువురితో అతను తరచూ మాట్లాడుతుండేవాడని గుర్తించారు. గతంలో హైదరాబాద్‌తో పాటు గోవా, శ్రీలంకలో క్యాసినోలు నిర్వహించినట్లు గుర్తించారు. జరిగిన లావాదేవీలపై సమాచారం సేకరించారు. పేకాట గురించి పలువురు ప్రజాప్రతినిధులకు ముందుగానే సమాచారం అందించే వాడని... కొంతమంది అధికారులతోనూ సుమన్‌కు పరిచయాలు ఉన్నాయని విచారణలో గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో పలువురిని మోసం చేసిన సుమన్.. కాంట్రాక్టులు, ఉద్యోగాలు, రియల్ ఎస్టేట్ పేరుతో డబ్బులు వసూలు చేసేవాడని కస్టడీలో తేలింది. సుమన్ ఇచ్చిన సమాచారంతో.. మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది.
ఇవీ చూడండి:
- Gambling Case: యంగ్ హీరో ఫాంహౌస్‌లో పేకాట.. మాజీ ఎమ్మెల్యే సహా 30 మంది అరెస్ట్
- Poker Players to Sri lanka: ముదిరిన వ్యసనం.. దేశ సరిహద్దులు దాటి పేకాట రాయుళ్ల పయనం..
- Gambling in Farm house case: పేకాట కేసులో 29 మందికి బెయిల్.. సుమన్‌కి మాత్రం నో...
- Gambling in Farm house case: పేకాట కేసులో 29 మందికి బెయిల్.. సుమన్‌కి మాత్రం నో...