మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర పరిధిలోని పలు విత్తన దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ నిషేధిత 1212 పత్తి విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు పాటించని 8 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశారు.
దేవరకద్రలోని మరో దుకాణం నుంచి 92 లీటర్ల నిషేధిత కలుపు నివారణ మందును సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నకిలీ విత్తనాలను విక్రయిస్తే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని వారు హెచ్చరించారు. రైతులు నాణ్యమైన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు.
ఇదీ చదవండి: Accident: ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఇద్దరు మృతి